గోపిచంద్ 32 ఆసక్తికర టైటిల్!

11
- Advertisement -

‘మాచో స్టార్’ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 లో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. గోపిచంద్ కెరీర్‌లో ఇది 32వ సినిమా. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర టైటిల్ ప్రచారంలో ఉంది. విశ్వం అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలసిస్తోందట. స్క్రిప్ట్ కి తగ్గట్లుగా ఈ టైటిల్ సరిపోతుందని అంటున్నారు. అయితే ఈ మూవీ శ్రీనువైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్‌ రామబాణంతో వచ్చిన అంతగా ఆకట్టుకోలేక పోయారు. దీంతో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు గోపిచంద్.

Also Read:విష్ణు డ్రీమ్ ప్రాజెక్టులో ప్రభాస్!

- Advertisement -