మార్చ్ లో సౌండ్ చేస్తాడా?

26
- Advertisement -

విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ సినిమా ఫిబ్రవరి 17 న థియేటర్స్ లోకి రావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ చేసుకున్నాడు విశ్వక్ . సినిమాను మార్చ్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

నిజానికి ధమ్కీ కోసం విశ్వక్ బాగా ఖర్చు పెడుతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకు తనే దర్శకుడు మరియు నిర్మాత కూడా కాబట్టి ఇటు హీరోగా అటు డైరెక్టర్ గా ఫైనల్ గా నిర్మాతగా సక్సెస్ క్రెడిట్ అంతా తనే అందుకోవాలని చూస్తున్నాడు.

ఈ సినిమాకు ముందు పాగల్ దర్శకుడు నరేష్ ను అనుకున్నారు. ఓపెనింగ్ చేసి కొన్ని రోజులు ఘాట్ అయ్యాక నరేష్ ను పక్కకి జరిపి విశ్వక్ డైరెక్టర్ గా మారి టేకప్ చేశాడు. ఎలాగూ ఫలక్ నుమా దాస్ తీసిన అనుభవం ఉండనే ఉంది పైగా తనే నిర్మాత కాబట్టి ఉన్నపళంగా డిసిషన్ తీసుకొని సినిమాకి మూడు విధాలుగా కష్టపడ్డాడు.

కానీ ఈ సినిమా విషయంలో ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథ, ‘గౌతం నంద’ను పోలి ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మేకర్స్ మాత్రం ఇందులో ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ ఉంటుందని , గోపీచంద్ సినిమాతో పోలిక ఉండదని , రిచ్ , పూర్ అనేది ఎన్నో సినిమాల్లో చూపించారని గట్టిగా చెప్తున్నారు. ఏదేమైనా ఫిబ్రవరి రేస్ నుండి కుర్ర హీరో వెనక్కి జరిగినట్టే. మరి విశ్వక్ సినిమాతో మార్చ్ లో ఎలాంటి సౌండ్ చేస్తాడో ?

ఇవి కూడా చదవండి..

- Advertisement -