‘అశోకవనంలో అర్జున కల్యాణం’లో విశ్వక్‌..

301
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ ప్రస్తుతం పాగల్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌వీసీసీడిజిటల్‌ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్‌ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విద్యాసాగర్‌ చింతా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాకు ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ అనే అద్భుతమైన టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా ఒక లవ్‌ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర వర్గాలు తెలిపాయి.ఈ చిత్రంలో విశ్వక్‌ అర్జున పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్‌ కోలా కథ సిద్ధం చేయగా.. జయకృష్ణ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. విశ్వక్‌ తల్లి దుర్గ హీరోపై తొలి క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌ సహా ఇతర టెక్నిషీయన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది.

Hero Vishwak Sen
- Advertisement -