టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు..

45
minister srinivas goud

సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తూరులో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలసి మంత్రి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తిమ్మాపూర్ పంచాయతీ వార్డు సభ్యులు పాశం కృష్ణ, పాశం మమత అరుణ్ కుమార్, వస్కుల మమత మహేందర్‌ ఆధ్వర్యంలో వచ్చిన వందలాది మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరామన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు.

మంత్రి మాట్లాడుతూ..కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకుంటూ కొత్తూరు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డును సంపూర్ణ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు.