విశ్వక్ సేన్ “హిట్” ఫస్ట్ డే కలెక్షన్స్

439
Hit-Movie
- Advertisement -

ఫలక్ నుమా దాస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ సేన్ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మించారు. రుహని శర్మ హీరోయిన్ గా నటించింది. సస్పెన్స్ ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈమూవీలో విశ్వక్ సేన్ పోలీస్ పాత్రలో నటించాడు.

ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆనందంగా ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 1.4 కోట్ల షేర్ ను రాబట్టింది. వీకెండ్ కావడంతో శని, ఆది వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -