జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’. ఈసినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా ‘డ్రాగన్’ ఫేమ్ కాయదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఓ ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేశారు. చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు హైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్‌లో ఘనంగా విడుదల చేయనున్నారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సినిమా యూనిట్ మొత్తం హాజరుకానుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥
Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad.
Join us for pure FUNKY MADNESS 😎🔥In cinemas from FEB 13 #FunkyFrom13thFeb
Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL
— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026
Also Read:KTR:ప్రజల గుండెల్లో కేసీఆర్ ధ్రువతార

