- Advertisement -
‘అశోకవనంలో అర్జునకల్యాణం’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్సేన్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఈ మాస్ కా దాస్ చేసిన ప్రాంక్ వీడియోపై ఓ చానల్ డిబేట్ నిర్వహించగా, యాంకర్ పై విష్వక్సేన్ పరుష పదజాలం ఉపయోగించాడు. మైక్ లు పీకేసి స్టూడియో నుంచి నిష్క్రమించాడు. విష్వక్సేన్ వైఖరిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వక్ స్పందించారు. సదరు యాంకర్‌ను క్షమాపణ కోరారు. ‘దెబ్బ తగిలితే అమ్మా అని ఎలా అంటామో.. ఆ సమయంలో అలాంటి బాధతోనే అలా అన్నానని, యువకుడికి కావడం వల్ల ఆవేశంతో ఒకే ఒక్క పరుష పదం వాడటం తప్ప ఎలాంటి తప్పు చేయలేదని విశ్వక్సేన్ తెలిపారు. ‘ఎఫ్’ అనే ఒక్క పదం నోరు జారినందుకు క్షమాపణ చెప్పారు.
- Advertisement -