‘మా’పై మంచు విష్ణు ఫైర్

208
Vishnu Manchu's Letter Shakes MAA
- Advertisement -

టాలీవుడ్‌లో తాజాగా కాస్టింగ్ కౌచ్ వివాదం తారా స్థాయికి చేరి, తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్‌ దీ టౌన్‌గా మారింది. ఈ నేపధ్యంలో పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డికి చేసిన ఆరోపణలపై కొందరు యంగ్‌ హీరోలు ఇప్పటికే స్సందించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు శ్రీరెడ్డి వ్యవహారంలో ‘మా’ వ్యవహరించిన తీరుపై ‘మా’ అధ్యక్షుడికి లేఖ రాశారు.

ఈ మధ్య కాలంలో కొన్ని విష‌యాల్లో ‘మా’ అసోషియేష‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు పట్ల నేను చాలా బాధపడ్డాను. తెలుగు సినిమా వాళ్ల సంక్షేమం కోసం ఈ సంఘం ఏర్ప‌డింది. ‘మా’లో మెంబ‌ర్‌షిప్ లేని ఓ వ్య‌క్తి విష‌యంలో ‘మా’ వ్య‌వ‌హ‌రించిన తీరు గంద‌ర‌గోళంగా ఉంది. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల కార‌ణంగా హ‌డావిడిగా స‌మావేశం నిర్వ‌హించి ‘మా’లో స‌భ్య‌త్వం ఉన్నవారు ఎవ‌రూ ఆమెతో న‌టించ‌కూడద‌ని నిషేధం విధించారు.

Vishnu Manchu's Letter Shakes MAA

అయితే‘మా’లో స‌భ్య‌త్వంలో మా నాన్న‌గారు, నేను, మా అక్క‌, మా త‌మ్ముడు కూడా ఉన్నాం. మ‌మ్మ‌ల్ని కూడా క‌లిపే చెప్పారా? ఓ న‌టుడిగా, నిర్మాత‌గా ఎవ‌రితో న‌టించాల‌నే విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల్సిన హ‌క్కు నాకుంది. ఆ విష‌యంలో మీరు ఆదేశాలు జారీ చేయ‌కూడ‌దు.

మ‌ళ్లీ ఆమె సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద కుటుంబాల‌పై, వ్య‌క్తుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌గానే.. ఆ నిషేధం ఎత్తేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల ‘మా’ ప‌రువు పోతోంది. ప్ర‌జ‌ల‌, మీడియా దృష్టిలో చుల‌క‌న అయిపోతోంది. ద‌య‌చేసి మీ చ‌ర్య‌ల‌తో ‘మా’కు చెడ్డ పేరు తీసుకురాకండి. ముందుగా ‘మా’కు మార్గ‌ద‌ర్శ‌కాలు ఏర్పాటు చేయండి. సినీ ప‌రిశ్ర‌మకు చెందిన 24 క్రాఫ్ట్‌లు త‌ప్ప‌నిస‌రిగా ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించే విధంగా చ‌ర్య‌లు తీసుకోండి. ప్ర‌స్తుతం ‘మా’లో స‌భ్య‌త్వం లేని స్థానిక న‌టులు చాలామంది ఉన్నారు. వారంద‌రితో నేను న‌టించొచ్చా? ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెడ్డ‌పేరు తీసుకొస్తున్నాయి. ఈ విష‌యంలో గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు బాధ్య‌తను ‘మా’కు కాకుండా ఫిల్మ్ ఛాంబ‌ర్‌కు అప్ప‌గించాలి` అంటూ ‘మా’ అసోషియేష‌న్‌కు మంచు విష్ణు పలు సూచనలు చేశారు.

- Advertisement -