ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా విష్ణుకుమార్ రాజు

33
- Advertisement -

ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు,. విశాఖపట్నం నార్త్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు విష్ణుకుమర్‌ రాజును ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు. 2014-19 మధ్య కూడా బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2019-24 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రం దిగజారిపోయేలా పాలన జరిగిందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని …ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ -జనసేన కూటమిగా పోటీ చేశాయి. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల విజయం సాధించారు. టీడీపీ 144 స్థానాలకు గాను 134 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల గెలుపొందింది.

Also Read:ఎమ్మెల్యేలు అందుకే పార్టీ మారడం లేదు..కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

- Advertisement -