- Advertisement -
తమిళ నటుడు విశాల్ కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే విశాల్ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఆయనను బలపరుస్తూ సంతకాలు చేసిన పది మందిలో ఇద్దరి సంతకాలు సరిగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఈసీ తెలిపింది.
తొలిసారిగా ఎన్నికల బరిలోకి పోటీ పడటం ద్వారా ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని అనుకుంటున్నట్టు చెప్పిన విశాల్‌కు ఈసీ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది. మరోవైపు ఆర్కే నగర్ నుంచి జయలలిత మేనకోడలు దీపాజయకుమార్ దాఖలు చేసిన నామినేషన్‌ను కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది. అఫిడవిట్లో లోపాల కారణంగా నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
- Advertisement -