హీరో విశాల్ వచ్చే ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలియజేశాడు. హీరోగా తమిళనాడులోనే కాదు.. తెలుగులోనూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. కేవలం నటుడిగానే కాకుండా కోలీవుడ్ నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి, గెలుపొందాడు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.
గతంలోనే జయలలిత మృతి వల్ల ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి విశాల్ రెడీ అయ్యాడు. నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్ ను ప్రతిపాదించిన 10 మందిలో కొంత మంది మద్దతును ఉపసంహరించుకోవడంతో… ఆ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ సిద్ధమవుతున్నాడు.
త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నైలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని విశాల్ భావిస్తున్నాడు. విశాల్ ఏ నియోజక వర్గం నుండి పోటీ చేస్తాడనేది ఇంకా తెలియడం లేదు. అయితే ఇప్పటికే విశాల్ తన గెలుపు కోసం తన అభిమాన సంఘాల ప్రతినిదులతో మాట్లాడుతున్నారట. ఎక్కడి నుండి పోటీ చేసేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడు.