- Advertisement -
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన అనంతరం రజనికి తమిళ సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. రజనీ పార్టీలో రాఘవ లారెన్స్ చేరే అవకాశం ఉందని ఓవైపు తెలుస్తోంది. మరోవైపు యంగ్ హీరో, తెలుగు వ్యక్తి విశాల్ సైతం రజనీకి మద్దతు పలికాడు.
రజనీ కోసం ఓ కార్యకర్తలా పని చేస్తానని… మొత్తం 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ తెలిపాడు. రజనీకి విశాల్ మద్దతు పలకడం కీలక పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విశాల్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే అతని నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో, నిరుత్సాహానికి గురైన విశాల్… ఆ ఎన్నికలో శశికళ మేనల్లుడు దినకరన్ కు మద్దతు పలికాడు. ఆ తర్వాత దినకరన్ ఘన విజయం సాధించాడు. తాజాగా రజనీకి విశాల్ మద్దతు పలకడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -