షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ కి ప్రమాదాలు జరగడం మామూలే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే ఆర్టిస్టులకి గాయలవుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకుంటూ సినిమా షూటింగ్స్ ని చేస్తారు ఆర్టిస్టులు. నటీ నటులు సినిమా షూటింగుల్లో ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. తాజాగా తమిళ హీరో విశాల్ మరోసారి గాయపడ్డారు. మార్క్ ఆంటోనీ సినిమాలో నటిస్తున్న విశాల్ మూవీ షూటింగ్లో యాక్షన్ సీన్ చేస్తూ గాయాలపాలయ్యారు. గురువారం తెల్లవారు జామున చెన్నైలో చిత్ర షూటింగ్ మొదలైంది…. ఇందులో భాగంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లో విశాల్ నటిస్తుండగా తీవ్ర గాయం అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
విశాల్ లాఠీ అనే సినిమాను రీసెంట్గా కంప్లీట్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్లోనూ అతను మూడు సార్లు గాయపడ్డారు. దాని వల్ల చిత్రం షూట్ లేట్ అవుతూ వచ్చింది. చివరకు షూటింగ్ పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టేశారు. ఇక ఈ సినిమాలో విశాల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. అంతకు ముందు ఎనిమి చిత్ర షూటింగ్లో కూడా విశాల్ గాయపడ్డారు. దీంతో విశాల్కి గాయాలకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అభిమానులు అనుకుంటున్నారు. కాబట్టి యాక్షన్ సీన్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
రోల్, కెమెరా, యాక్షన్..అనగానే ఏ యాక్టర్ అయిన యాక్ట్ చేస్తారు. కాని తాజాగా సాగర కన్య మాత్రం డైరక్టర్ చెప్పినట్టు చేశానాని చెప్పుకోచ్చింది. రోల్, కెమెరా, యాక్షన్..బ్రేక్ ఏ లెగ్! అని అని డైరెక్టర్ చెప్పినట్టుగానే… తాను కాలు విరగ్గొట్టుకున్నానని చెప్తూ… గాయపడిన కాలుతో విక్టరీ సింబల్ ను చూపిస్తూ ఫొటోకు ఫోజిచ్చింది. డైరెక్టర్ చెప్పిన మాటను నేను సీరియస్ గా తీసుకున్నానని చెప్పింది. దీంతో ఆరు వారాల పాటు వర్క్ నుండి రెస్ట్ దొరికిందని చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి. ప్రస్తుతం సుఖి సినిమాతో పాటు ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె తన మొదటి వెబ్ సిరీస్‌లో యాక్షన్ పార్ట్ కూడా చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఆమెకు ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా కాలికి గాయమైనట్టు స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన భోలా సినిమాలో నటిస్తుంది టబు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా ట్రక్ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ట్రక్ అద్దాలు పగిలి టబూకు గుచ్చుకున్నాయి. దీంతో టబుకి గాయాలయ్యాయి. సెట్‌లోనే ప్రథమ చికిత్స అందించి ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించారు. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రస్తుతానికి షూటింగ్ ని రెండు రోజులు నిలిపేశారు.