సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం కాలా. జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే కర్ణాటకలో మాత్రం కాలా చిత్రాన్ని విడుదల కాకుండా కన్నడ ఫిలింఛాంబర్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కావేరి జల వివాదాల నేపథ్యంలో రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన సినిమాలను కన్నడనాట నిషేధించామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోవింద్ చెప్పారు.
తాజాగా ఈ విషయంపై నటుడు, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ స్పందించాడు. కాలా సినిమాను అడ్డుకోవడం అనైతికమని. ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం అంటే భావప్రకటన స్వేచ్చను అడ్డుకోవడమేనని అన్నారు. సామాజిక అంశాలకు, సినిమాలకు ముడిపెట్టడం సరికాదని చెప్పాడు. ఈ విషయంపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ పునరాలోచించాలని విశాల్ కోరాడు.
మరోవైపు ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ నిర్మాణంలో వండర్ బార్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించాడు. అయితే తెలుగులో మాత్రం కాలా బిజినెస్ ఆశాజనకంగా లేదనే చెప్పాలి. తెలుగు డబ్బింగ్ రైట్స్ ధనుష్ రూ. 40 కోట్లు చెప్పడంతో నిర్మాతలు వెనకడుగు వేశారు.
నైజాం రైట్స్ దక్కించుకోవాలనుకున్న దిల్ రాజు సైతం భారీ రేటు చెప్పడంతో వెనక్కు తగ్గాడు. ‘లింగా’ లాంటి డిజాస్టర్ సినిమాకు సైతం తెలుగులో బిజినెస్ బాగానే జరిగింది. ఆ తర్వాత వచ్చిన కబాలి కూడా డిజాస్టర్ కావడంతో… కాలా సినిమాపై తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. జూలై 7లోపు కాలా ఏ మాత్రం బిజినెస్ జరుపుకుంటుందో చూడాలి ఇక.