విశాల్ రత్నం ఓటీటీ డేట్ లాక్!

19
- Advertisement -

విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా రత్నం చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

దర్శకుడు హరి – విశాలం కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ఇది. విశాల్ కెరీర్ లో ఫ్లాప్ మూవీగా ఇది మిగిలిపోగా తాజాగా ఓటిటి రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా మే 24 నుంచే తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా జీ స్టూడియోస్ నిర్మాణం వహించారు.

Also Read:మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -