యాక్షన్ హీరో విశాల్ గత కొంత కాలంగా రాజకీయాల్లో వస్తారని ఊహగానాలకు చెక్ పడింది. జగన్‌ను అభిమానించే హీరో విశాల్ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని గత కొంతకాలంగా వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. అయితే ఇవన్నీ వట్టి వదంతులేనని విశాల్ ఖండించాడు. దీంతో రాజకీయాల టాపిక్ మారిపోయింది.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత తను ఉప ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో మరొక సారి రాజకీయాల ఊసే లేకుండా దూరంగా జరిగారు. తాజాగా తమిళనాడు మాజీ సీఎం ఆన్నాడీఎంకే స్థాపకుడు ఎంజీఆర్ ఫోటోను గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి విశాల్ రాజకీయ ఆరంగేట్రంపై కోలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. అయితే గతంలో పలు సందర్భాల్లో ఇంటర్వ్యూలో ఏంజీఆర్‌కు వీర అభిమానిని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై రెండు రకాలగా కోలీవుడ్‌లో చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని….అందుకోసం ఈ ఫోటోను గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నారని అనుకుంటున్నారు. మరోవైపు సినిమాలోని పాత్ర కోసం ప్రయత్నించారేమోనంటూ పలువురు కోలీవుడ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోని సినిమాలో నటిస్తున్నారు. సునీల్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు డిటెక్టివ్ 2 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు కోలీవుడ్‌లో టాక్. అన్నట్టు ఈ సినిమాకు విశాల్ దర్శకత్వం వహించనున్నారు.
*புரட்சி தலைவர் எம். ஜி.ஆர் படத்தை தன் நெஞ்சில் பச்சைகுத்தி இருக்கும் நடிகர் விஷால் அவர்கள்* #Vishal @VishalKOfficial @HariKr_official @VffVishal #MGR pic.twitter.com/AmmqIsook5
— Nikil Murukan (@onlynikil) January 24, 2023
ఇవి కూడా చదవండి..