త‌మిళ్ ‘టెంప‌ర్’ రీమేక్ లో విశాల్…

193
temper, vishal

తెలుగులో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన టెంప‌ర్ మూవీ భారీ విజ‌య‌న్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈసినిమాకు పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్ నిర్మించారు. ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఈసినిమా బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. అంతకాకుండా బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఇక ఈమూవీ తెలుగులో భారీ విజ‌యాన్ని అందుకోవ‌డంతో త‌మిళ్ లో కూడా రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

temper

అయితే తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం విశాల్ హీరోగా..ఠాగూర్ మ‌ధు ఈమూవీని నిర్మించ‌న్నాడ‌ని తెలుస్తుంది. పుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈసినిమాను త‌మిళంలో తెర‌కెక్కిస్తే భారీ విజ‌యాన్ని అందుకుంటుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు నిర్మాత ఠాగూర్ మ‌ధు. డైరెక్ట‌ర్ , హీరోయిన్ ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారని స‌మాచారం.

vishal

ఆగ‌స్టు మొద‌టి వారంలో ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను మొద‌లుపెట్ట‌నున్నారు. త‌మిళంలో విశాల్ కు మాస్ ఇమేజ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో హీరోగా తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇక ప్రస్తుతం విశాల్ న‌టించిన పందెంకోడి 2 సినిమా చిత్రిక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది. తెలుగు, త‌మిళ్ లో రెండు భాష‌ల్లో ఈమూవీని విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులో ఈసినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. తెలుగులో ఠాగూర్ మ‌ధు శాటిలైట్ హ‌క్కుల‌ను తీస‌కున్నాడు. దీపావ‌ళి కానుగా ఈసినిమాకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.