కొత్త హీరోతో దిల్ రాజు ‘పలుకే బంగారమాయే’

254
Dil_Raju

డిస్ట్రీబ్యూట‌ర్ స్ధాయి నుంచి టాలీవుడ్ లో టాప్ ప్రోడ్యూస‌ర్ గా ఎదిగాడు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. ప్ర‌స్తుతం టాలీవుడ్ ప్రోడ్యూస‌ర్లలో నెం1 నిర్మాత‌గా కొన‌సాగుతున్నాడు. ఆడియ‌న్స్ కి న‌చ్చే క‌థ‌ల‌ను తీస్తూ కొత్త వాళ్ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడు. క‌థ‌ను ఎంపిక చేసుకొవ‌డంలో ఆయ‌న స్టైలే వేరు. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్క‌వ డ‌బ్బులు రాబట్ట‌గ‌లిగే సినిమాలు తీస్తుంటాడు. ప్ర‌స్తుతం దిల్ రాజు త‌న బ్యాన‌ర్ చ‌కాచ‌కా సినిమాలు చేస‌కుంటు వ‌స్తున్నాడు.

Dil-Raju

దిల్ రాజు ప్ర‌స్తుతం నితిన్ తో శ్రీనివాస్ క‌ళ్యాణం సినిమా చేస్తుండ‌గా, ఈసినిమాకు శ‌త‌మానం భ‌వ‌తి ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగ‌శ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో ఎఫ్ 2 అనే మ‌ల్టిస్టార‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈసినిమాలో వ‌రుణ్ తేజ్, విక్ట‌రీ వెంక‌టేశ్ లు హీరోలు గా న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీసేందుకు సిద్ద‌మ‌య్యాడు దిల్ రాజు.

తాజాగా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం మ‌రో కొత్త హీరోతో దిల్ రాజు సినిమా తీయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. త‌న త‌మ్ముడు శిరీష్ త‌న‌యుడు ఆశిష్ హీరోగా ఓ సినిమాను నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. అందుకు త‌గ్గ‌ట్టుగా దిల్ రాజు అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశాడని తెలుస్తుంది. ఈసినిమాకు టైటిల్ ను కూడా ఖ‌రారు చేశారు. ప‌లుకే బంగార‌మామే అనే టైటిల్ తో సినిమాను తెర‌కెక్కించునున్నారు. ఈసినిమా ద్వారా నూత‌న ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌నున్నాడు దిల్ రాజు. ద‌స‌రా రోజున సినిమాను లాంచ్ చేసి..జ‌న‌వ‌రి నుంచి రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.