డిటెక్టివ్ గా టాలీవుడ్ కోలీవుడ్ లలో సత్తా చాటిన విశాల్, త్వరలో అభిమన్యుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి సమంత…విశాల్‌కు జోడిగా నటించనుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో హరి వెంకటేశ్వరా ఫిలిమ్స్ పతాకంపై హరి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్‌గా.. ప్రెజెంట్ చేశారు.
చాలా సిసిటివి ఫుటేజ్ స్ర్కీన్ల ముందు నుంచున్న విలన్ అర్జున్.. ఆ స్ర్కీన్లలో విశాల్ ముఖాన్ని గమనిస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా ఏదో ఇన్సిడెంట్ తాలూకు విషయాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనమాట. అంటే ఈ మూవీ కూడా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.