విశాఖ టెస్టు..దక్షిణాఫ్రికా 431 ఆలౌట్

559
ind vs sa
- Advertisement -

విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 431 పరుగులకు ఆలౌటైంది. నాలుగోరోజు తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికాను ఆలౌట్‌ చేసిన భారత్ 71 పరుగుల ఆధిక్యం సాధించింది.

నాలుగో రోజైన శనివారం 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సఫారీలు 431 పరుగులకు ఆలౌటయ్యారు. సఫారీ జట్టులో డీన్ ఎల్గర్ (160 ), డికాక్ (111 ) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో అశ్విన్ ఏడు, జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు.

ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (215), రోహిత్ శర్మ (176) సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. దక్షిణాఫ్రికా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -