విశాఖ శారదాపీఠం చరిత్రలో నూతన అధ్యాయం..

624
Vishaka Sri Sarada Peetham
- Advertisement -

విశాఖ శారదాపీఠం నూతన అధ్యాయానికి తెరతీసింది. ఆధ్యాత్మిక రంగంలో సుదీర్ఘ ప్రయాణం సాగించిన పీఠం తొలిసారి ఒక చిహ్నానికి రూపకల్పన చేసింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఈ లోగోను శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠం ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వేదికగా నిలిచింది.

ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆది శంకరాచార్యుల వారి అద్వైత తత్వానికి అద్దం పట్టేలా లోగోను మలిచినట్లు ప్రకటించారు. సర్వ మానవాళిలో అద్వైత వేదాంత చింతనను పెంచేందుకు “అద్వైతం సత్యం” అనే నినాదాన్ని విశాఖ శ్రీ శారదా పీఠం విస్తృతంగా ప్రచారం కల్పించబోతోందని తెలిపారు. మానవుడు జీవన్ముక్తిని పొందడానికి సంసార సాగరాన్ని ఎందుకు వీడాలి? మోక్ష సిద్ధి కోసం ఎటువంటి ప్రయత్నం చేయాలి? తదితర అంశాలపై లోగోలో వివరణాత్మకమైన సందేశం ఇచ్చామన్నారు.

విశాఖ శారదా పీఠం మహిమ యావత్ ప్రపంచమంతా చాటేలా లోగోను రూపొందించినట్లు స్వామి స్వరూపానందేంద్ర ప్రకటించారు. జ్ఞానానికి చిహ్నమైన వృక్షాన్ని వృత్తాకారంలో ఎందుకు పొందుపరిచారో స్వామీజీ వివరించారు. లోగోలో శారదా పీఠం అధిష్ఠాన దేవత రాజశ్యామల అమ్మవారి వాహనమైన హంస, పీఠం గురుపరంపరకు ప్రతీకగా నిలిచే రుద్రాక్షలతో లోగో ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక భావాలు రేకెత్తించేలా విలక్షణంగా లోగోను రూపొందించామని తెలిపారు.

- Advertisement -