విరాట్‌ను పట్టించుకోని హార్థిక్.. అసలేమైంది.?

31
- Advertisement -

ముంబై వేదికగా జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హార్థిక్ పాండ్యా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని పట్టించుకొనట్టు కనపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20ఓవర్లు ముగిసేనాటికి 129పరుగులకు 3వికెట్లు కోల్పోయి పటిష్టి స్థితిలో నిలిచింది. అయితే ఈ క్రమంలో 21వ ఓవర్‌ బౌలింగ్ చేయడానికి కుల్దీప్ యాదవ్ వచ్చారు. దీంతో విరాట్ ఫీల్డ్‌లో మార్పు చేయాలని హార్థిక్‌కు సూచించారు. కానీ విరాట్‌ మాటలు పట్టనట్టుగా దూరంగా వెళ్లిపోయారు. వెంటనే కోహ్లీ కూడా హార్థిక్‌ను ఉద్దేశించి కోపంగా ఏదో అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో విరాట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హార్థిక్‌ను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ మరి కొందరు కెప్టెన్ అయినా మాత్రానా సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా…అని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి…

పాక్‌లో భారత్ పర్యటించకూడదు: హర్భజన్‌

జెర్సీ డిజైన్ మార్చిన సన్‌రైజర్స్‌…

ఒక్క సీజన్‌ గెలవలేదు..కానీ అదే ఉత్సాహం:విరాట్‌

- Advertisement -