పాక్‌ నుంచి భారత్‌కి చేరింది..

204
- Advertisement -

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టు టెస్టుల్లో అగ్రస్థానం చేరుకోవడంతో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న జట్టుకు ఐసీసీ అందించనున్న ప్రతిష్ఠాత్మక ‘గద’ భారత్‌ ఒడికి చేరింది. ఇండోర్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఘన విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 3-0తో దక్కించుకుంది. కోల్‌కతా వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది.

gada

మంగళవారం ఇండోర్‌లో మూడో టెస్టు ముగిసిన అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ గద అందించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ నుంచి భారత్‌ ఈ గద అందుకుంది. 2003లో ర్యాంకింగ్స్‌ విధానం ప్రవేశపెట్టిన తరువాత పాకిస్థాన్‌ ఇటీవల ఈ గదను తొలిసారి అందుకుంది. అయితే స్వల్ప వ్యవధిలోనే పాక్‌ నుంచి భారత్‌ గదను చేజెక్కించుకుంది.

టీమిండియా సొంతగడ్డపైనే ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాతో వరుస టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఆ సిరీస్‌లు కూడా గెలిస్తే నెంబర్ వన్ ర్యాంక్‌ సుదీర్ఘంగా నిలబెట్టుకునే అవకాశం కోహ్లీ సేనకు దక్కనుంది.

virat kohli

- Advertisement -