ఆఫీస్‌కు రాగానే ముద్దులాట.. వీడియో చూడండి

234
Female workers forced to line up and kiss their boss
Female workers forced to line up and kiss their boss
- Advertisement -

ప్రపంచీకరణ పెరుగుతున్న ఈ రోజుల్లో, వివిధ దేశాలలో అనేక ప్రైవేటు సంస్థలు అనేక రకాలు గా విస్తరిస్తున్నాయి. అనేక ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. ప్రతిభ కలవారు, కేవలం తమ ప్రతిభ మాత్రమే కాక , వివిధ సంస్థలలో , తాము ఇతర ఉద్యోగులతోనూ , వారు పనిచేసే సంస్థ యాజమాన్యం తోనూ అనేక విధాలు గా కలిసి పోవడమే కాకుండా , తదనుగుణంగా వారు తమ పని సూత్రాలనూ , అంటే పని చేసే విధానాలనూ , పద్ధతులనూ కూడా మార్చు కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలన్నది సాధారణంగా ఈ రోజుల్లో వినబడే నీతి సూత్రం. అయితే చైనాలో మాత్రం కలిసిపోవడమంటే అలా కాదట. చైనాలోని టాంగ్‌ జ్యు జిల్లాలో ఉన్న ఈ కంపెనీలో అమ్మాయిలు పనిచేయాలంటే బాస్ తో ప్రతిరోజూ పెదవులు కలపాల్సిందే.

ఉదయం ఆఫీస్ కు రాగానే.. పొద్దున్నే 9 నుండి 9:30 మధ్యలో బాస్ ముందు క్యూ కట్టి కిస్ చేసే సెర్మనీకి హాజరు కావాలి. హాజరు కాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందే. చైనీస్ సోషల్ మీడియాలో ఓ వీడియో ఇపుడు వైరల్ అయింది. దీన్ని ఎవరో వీడియో తీసి చైనీస్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఉద్యోగులంతా ప్రేయర్ చేయడానికి వచ్చినట్టు నిలబడతారు. బాస్ వచ్చి పెదవులు కలుపుకుంటూ పోతాడు. వారు కూడా ఉత్సాహంగా బాస్‌తో పెదవులు కలపడానికి ఉత్సాహం చూపిస్తారు.

kissing_boss2

దీనిపై అక్కడి మీడియా సదరు బాసుని వివరణ కోరగా.. ఇలా రోజు ఆఫీస్‌ ప్రారంభంలో పెదవులు కలిపితే స్టాఫ్‌కి మెనేజర్లకి మధ్య బంధం(చాప-నీటి బంధం లాగ) బలపడుతుందని అన్నారు. ఒకవేళ మెనేజర్ ఆ రోజు రాకపోతే కొందరు లేడి స్టాఫ్‌ బాగా మిస్ అవుతున్నట్లు మెస్సేజ్‌లు కూడా పంపుతారట. ఈ ఐడియాని అమెరికా కంపెనీల నుండే కాపీ కొట్టానని ఆ బాసు వెల్లడించాడు.

ఇలా ముద్దులు పెట్టలేమన్న పాపానికి గతంలో కొందరు రిజైన్ చేసి కూడా వెళ్లిపోయారట. ఇప్పుడీ వ్యవహారాన్ని ‘పీపుల్స్ డైలీ’ బట్టబయలు చేయగా, ఆ బాస్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫీమేల్ స్టాఫ్‌ ఎలా అగయిత్యానికి పాల్పడుతున్నారు..? వీరికి బాయ్ ఫ్రెండ్స్ కాని.. మొగుళ్లు కానీ లేరా..? అంటూ కొందరు కామెంట్లు చేయగా.. వీళ్లు బతకడానికి వేరే ఉద్యోగమే లేదా..? అని మరికొందరు వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. ఆ ముద్దుల వీడియోను మీరూ చూడండి!

https://youtu.be/hhpwP-SDbfk

- Advertisement -