దుబాయ్‌లో కుటుంబసభ్యులతో విరాట్‌..

90
virat

క్వారంటైన్ ముగియడంతో దుబాయ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ. త‌న భార్య అనుష్క శ‌ర్మ‌, కుమార్తె వామికాతో క‌లిసి దుబాయ్‌లో బుధ‌వారం ఉద‌యం అల్పాహారం తీసుకున్నారు. ఈ ఫోటోను కోహ్లీ ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు.

క‌ల‌ర్‌ఫుల్ బాల్స్ మ‌ధ్య‌లో వామికా కూర్చొని ఆడుకుంటుండ‌గా.. ఆమెను చూస్తూ కోహ్లీ న‌వ్వుతున్న ఫోటోను అనుష్క షేర్ చేసింది. ఈ ఒక్క ఫ్రేమ్‌లోనే త‌న హృద‌యం ఉంద‌ని అనుష్క క్యాప్ష‌న్ ఇచ్చారు. దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా.. టీ20 రెండో వార్మ‌ప్ మ్యాచ్ ఇవాళ ఆడ‌నుంది.