రాజా విక్రమార్క…రిలీజ్ డేట్ ఫిక్స్

84
Raja-Vikramarka
- Advertisement -

వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో యంగ్ హీరో కార్తీకేయ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రాజా విక్రమార్క. కార్తీకేయ సరసన తన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చేశారు. నవంబర్ 12న “రాజావిక్రమార్క” ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారని రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తుండగా ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఆది రెడ్డి టి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -