విరాట్ మరో సంచలన నిర్ణయం..!

58
kohli

టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికు టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విరాట్….కెప్టెన్‌గా తనకు ఇదే చివరి ఐపీఎల్ అని వెల్లడించాడు.

ఐపీఎల్‌‌‌‌ 14 ఎడిషన్‌‌‌‌ ఫేజ్‌‌‌‌–2 తర్వాత ఆర్‌‌‌‌సీబీ కెప్టెన్‌‌‌‌గా తప్పుకుంటానని అయితే తన చివరి ఐపీఎల్ వరకు ప్లేయర్‌గా అది ఆర్సీబీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎంతో ఆలోచించి టీమ్‌‌‌‌ అందరితో మాట్లాడిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

ఆర్‌‌‌‌సీబీ జట్టును కెప్టెన్‌‌‌‌గా నడిపించిన నా ప్రయాణం చాలా గొప్పగా సాగిందని…ఈ అవకాశం నాకిచ్చిన ఆర్‌‌‌‌సీబీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, కోచ్‌‌‌‌లు, సపోర్ట్ స్టాఫ్‌‌‌‌, ప్లేయర్లకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌ కప్‌ని గెలవని ఆర్‌‌‌‌సీబీ మూడు సార్లు ఫైనల్లో ఓడింది. మరో మూడుసార్లు ప్లే ఆఫ్స్‌‌‌‌ వరకు వచ్చింది.