సాయిపల్లవితో అది చేయాలనుంది: చిరు

118
chiru
- Advertisement -

యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. సెప్టెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుండగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి…సాయిపల్లవిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల తన చిత్రంలో చెల్లిలి పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా ఆమె ఈ చిత్రంలో చేసేందుకు ఒప్పుకోలేదు. నాకు కూడా ఆమె అంగీకరించకుండా ఉంటేనే బాగుండు.. అనిపించిందని తెలిపారు.

అయితే తర్వాత ఆలోచిస్తే ఆమె ఒప్పుకోకపోవడమే మంచిదనిపించిందని ఎందుకంటే అంతమంచి డ్యాన్సర్‌తో డ్యాన్స్ చేయాలని కోరుకుంటాను కానీ.. చెల్లెలిగా అంటే నాకే మనసు అంగీకరించలేదన్నారు.

ఈ క్రమంలో మైక్ అందుకున్న సాయిపల్లవి..మీ మాటలు చాలా గౌరవంగా భావిస్తున్నాను సార్. నిజంగా నేను మీ సినిమాలో చేయను అని చెప్పలేదు. నేను రీమేక్ సినిమాలను చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గరకు ఎవరు వచ్చినా.. ముందుగా నేను అడిగే ప్రశ్న.. ఈ చిత్రం రీమేకా? అని అడుగుతాను. అందుకే చేయనని చెప్పాను.. తప్ప వేరే ఎటువంటి ఉద్దేశ్యం లేదు సార్ అని తెలిపింది.

- Advertisement -