రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు గుప్పించారు విరాట్ కోహ్లీ. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశి దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో భువనేశ్వర్,హాజల్‌వుడ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లపై ఎటువంటి భయం లేకుండా దాడి చేయడం విశేషం. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అతను చూపిన ధైర్యం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఈ ఇన్నింగ్స్‌ను చూసిన కోహ్లీ కూడా అతని ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ అనంతరం వైభవ్, కోహ్లీని కలిసి ఆటోగ్రాఫ్ కోరగా, “డియర్ వైభవ్, వెల్ డన్” అంటూ రాజస్థాన్ రాయల్స్ క్యాప్‌పై సందేశం రాశారు. ఈ చిన్న సందేశం వెనుక ఉన్న విలువ ఎంతో గొప్పది.
ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రదర్శన రాజస్థాన్ రాయల్స్ విజయానికి కీలకమైంది. కెప్టెన్ రియాన్ పరాగ్ నేతృత్వంలోని జట్టు 202 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది రాజస్థాన్‌కు వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.
ALso Read:బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు
ఇక వైభవ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 200 పరుగులు చేసి, రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో అతను ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

