- Advertisement -
కేరళ విమానా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ట్విట్టర్ ద్వారా విమాన ప్రమాద ఘటనపై స్పందించిన కోహ్లీ…కోజికోడ్‌లో విమాన ప్రమాదానికి గురైన వారి కోసం ప్రార్థిస్తున్నా. ప్రాణాలు కోల్పోయిన వారి ప్రియమైన వారందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు.
వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుండి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్ రన్ వేపై నుండి జారి లోయలో పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 20 మంది మృతిచెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. కేరళ ప్రమాద ఘటనపై సినీ,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
- Advertisement -