విత్తన గణపతి గొప్ప కార్యక్రమం: శివాజీరాజా

228
shivajiraja
- Advertisement -

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వినాయక చవితి సందర్భంగా ప్రారంభించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందనవస్తోంది.జర్నలిస్ట్ కాలనీ లో సినీ నటుడు శివాజీరాజా కి తన నివాసంలో విత్తన గణపతి ని పంపిణీ చేశారు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు.

ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ విత్తన గణపతి పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప నిర్ణయం..ఇది చాలా మంచి కాన్సెప్ట్..గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతున్నారని చెప్పారు.

ఈ వినాయక చవితికి అందరం విత్తన గణపతి ని పూజిద్దాం..వినాయకుని నిమజ్జనం అనంతరం అందులో నుండి వచ్చిన మొక్క పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది..ప్రతీ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం దీని ద్వారా నెరవేరుతుందన్నారు.

- Advertisement -