ఓటమితో ఇంగ్లాండ్ సిరీస్‌ను ప్రారంభించిన కోహ్లీ సేన ఓటమితోనే సిరీస్‌ను ముగించింది. వరుస ఓటములతో టెస్టు సిరీస్ కొల్పోయి ఇంటా,బయట విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా చివరిదైన ఐదో టెస్టులోనూ ఓటమి పాలైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బౌలర్ల ముందు తేలిపోయారు. చివరిరోజు రాహుల్, పంత్ అద్భుత పోరాటంతో విజయంపై ఆశలు రేపిన భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్‌ను 4-1 తేడాతో ముగించింది ఇంగ్లాండ్.
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 58/3తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 121 పరుగులకే 5 వికెట్లు కొల్పోయింది. ఈ స్ధితిలో భారత్ కనీసం 200 పరుగులైనా దాటుతుందా అని సందేహం.కానీ రాహుల్,పంత్ ఇద్దరు అసమాన పోరాట ప్రతిభను కనబర్చి ప్రత్యర్థి గుండెల్లో గుబులు రేపారు. పోరాడి ఓడిన గట్టిపోటి ఇచ్చి కాసింత ఊరట కలిగించారు.
కేఎల్ రాహుల్ (149; 224 బంతుల్లో 20×4, 1×6), రిషబ్ పంత్ (114; 146 బంతుల్లో 15×4, 4×6) సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో భారత్ 343 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ విజయంలో అండర్సన్ (3/45), కరన్ (2/23), రషీద్ (2/63) కీలకపాత్ర పోషించారు. కోహ్లి, సామ్ కరన్‌లకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించింది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 332
భారత్ తొలి ఇన్నింగ్స్: 292
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 423/8 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్: 345