మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు: కోహ్లీ

449
kohli
- Advertisement -

ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా తొలి సిరీస్‌కు సిద్ధమైంది. శనివారం(రేపటి) నుంచి టీ20 సిరీస్‌తో విండీస్ టూర్ ప్రారంభంకానుంది. వెస్టిండీస్‌తో మూడు టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్‌లు ఆడనుంది భారత్‌. ఈ నేపథ్యంలో విండీస్‌కి పయనమైంది భారత్‌.

అయితే విండీస్ పర్యటనకు వెళ్లే ముందుకు తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు కోహ్లీ. ఈ సందర్భంగా కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కోహ్లీ ముంబైలో జరిగిన ఫిలిప్స్‌ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇది చాలా అద్భుతంగా అనిపించిందన్నారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇదిఇలా ఉండగా కెప్టెన్‌గా కోహ్లీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ప్రపంచ కప్ లో భారత్ ఓటమి…. కోహ్లి, రోహిత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో విండీస్‌తో సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -