విరాట్ కోహ్లి @ నెంబర్ 1

282
kohli
- Advertisement -

వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసీసీ. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి నెంబర్ 1 స్ధానాన్ని నిలబెట్టుకోగా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండోస్ధానాన్ని దక్కించుకున్నారు. 871 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా తర్వాత రోహిత్ (855), పాకిస్తాన్ ఆటగాడు ఆజమ్ (829) తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇక బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా రెండోస్దానంలో బుమ్రా (719), ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ (701) మూడవ స్థానంలో ఉన్నారు.

ఆల్‌రౌండర్స్ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ (301) పాయింట్లతో తొలి స్ధానంలో నిలవగా బెన్ స్టోక్స్(293), ఇమాద్ వసీం(278) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.

- Advertisement -