అనుష్క శీర్షాసనం…సాయం చేసిన కోహ్లీ!

92
anushka

బాలీవుడ్ న‌టి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. ఆరు నెలల గ‌ర్భంలోనూ శీర్షాస‌నం వేయగా ఇందుకు విరాట్ కోహ్లీ సాయం చేశాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది అనుష్క.

త‌ల కిందికి, కాళ్లు పైకి పెట్టి చేసే ఈ ఆస‌నం చాలా క్లిష్ట‌మైందని అయితే యోగా త‌న జీవితంలో ఓ భాగ‌మైపోయింద‌ని, అందుకే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు గ‌ర్భవ‌తిగా ఉంటూ కూడా ప‌లు ఆస‌నాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపింది. అనుష్క-విరాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.