న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఎనిమిదేళ్ల తర్వాత ఈ టెస్టు మ్యాచ్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది. 2012లో ఆస్ట్రేలియా చేతిలో 0–4తో చిత్తుగా ఓడిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో వైట్‌వాష్ అవడం ఇదే మొదటిసారి.
అలాగే, విరాట్ కోహ్లీ కూడా టెస్టు కెప్టెన్‌గా తొలిసారి వైట్‌వాష్ ఓటమి రుచి చూశాడు. ఇది విరాట్‌కు, టీమిండియాకు చెత్త రికార్డు అనే చెప్పాలి. ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ ఒక్కసారి కూడా ఇలాంటి పరాజయాన్ని చవిచూడలేదు. ఇది కోహ్లీ క్రికెట్ చరిత్రలోనే వరస్ట్ రికార్టు అని విమర్శిస్తున్నారు.
అంతేకాదు 2018 నుంచి విదేశాల్లో ఆడిన నాలుగు సిరీస్‌ల్లో కోహ్లీసేన మూడింటిలో ఓటమితో వెనుదిరిగింది. అయితే 5 టీ20ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసి న్యూజిలాండ్ పర్యటనను గొప్పగా ఆరంభించిన భారత్ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైంది. వన్డే సిరీస్‌లోనూ 0–3తో వైట్‌వాష్ అయిన కోహ్లీసేన తాజాగా టెస్టుల్లోనూ ఒక్క విజయం సాధించకుండానే వెనుదిరగడం అభిమానులను నిరాశపర్చింది.