సిడ్నీ టెస్టులోనూ సత్తాచాటుతామని గెలుపు తమదేనని స్పష్టం చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. బాక్సింగ్ డే టెస్టులో గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ..బుమ్రా బౌలింగ్ అద్భుతమని కితాబిచ్చాడు.కీలక సమయాల్లో వికెట్లను పడగొట్టి జట్టును గెలుపు దిశగా పరుగెత్తించడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడని తెలిపారు.
ఈ విజయంతో తమకెంతో నమ్మకం ఏర్పడిందని, బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ ఆటగాళ్లు చక్కగా రాణించారని అన్నారు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తమ వద్దే ఉండనుందని గుర్తు చేసుకున్న విరాట్, సౌతాఫ్రికాతో విజయం తరువాత, ఆస్ట్రేలియాకు వచ్చామని, ఇక్కడ కూడా రాణిస్తామన్న నమ్మకముందని చెప్పాడు.
భారత్‌కు ఇది టెస్టుల్లో 150వ విజయం కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో 8 బాక్సింగ్ డే టెస్ట్‌లు ఆడిన భారత్.. తొలి సారి విజయం సాధించింది. ఇక ఆసీస్ పర్యటనలో భారత్ సిరీస్ కోల్పోకుండా ఉండటం భారత్‌కు ఇది నాలుగోసారి. ఇప్పటివరకు సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్ సిడ్నీ వేదికగా జనవరి 3నుంచి సి జరిగే చివరిటెస్టు మ్యాచ్ ఆడనుంది.