వివిఆర్‌..కోటి వ్యూస్

281
vvr
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం వినయ విధేయ రామ. లవ్‌ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా ఘనంగా జరిగింది. ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విడుదల చేసిన ట్రైలర్‌ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

ట్రైల‌ర్‌లో చెర్రీ సరికొత్త లుక్‌లో క‌నిపిచ‌డంతో పాటు స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. 10 మిలియ‌న్ ( కోటి) రియ‌ల్ టైమ్ వ్యూస్ ట్రైల‌ర్‌కి రాగా, ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్‌, ఆర్యన్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్రధాన తారాగణంగా న‌టించారు. బాలీవుడ్ బామ ఇషా గుప్తా చిత్రంలో ప్ర‌త్యేక సాంగ్‌తో అల‌రించ‌నుంది.

- Advertisement -