విరాట్ సెంచరీ..భారత్ గెలుపు

69
- Advertisement -

గౌహతీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ విధించిన 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 306 పరుగులు చేసింది. దీంతో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.

374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక టాప్ ఆర్డర్ వెంటవెంటనే వెనుదిరిగారు. అయితే ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన శ్రీలంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 3 సిక్స్‌లు,12 ఫోర్లతో 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నిస్సాంక (72), డిసిల్వ(47) రన్స్ చేశారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. షమీ, పాండ్యా, చహల్ తలో వికెట్ తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (83), ఓపెనర్ శుభ్ మన్ గిల్(70) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. విరాట్ 87 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -