సచిన్ రికార్డు బ్రేక్‌ చేసిన కోహ్లీ..

258
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ నిలిచాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 81 పరుగుల మార్క్ దగ్గర కోహ్లి వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇదివరకు సచిన్‌ 266 వన్డేల్లో ఈ ఘనత సాధించగా కోహ్లికి ఇది కేవలం 213వ ఇన్నింగ్స్‌లో సాధించడం విశేషం. ఇప్పుడు సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు.

Virat Kohli

2008లో అండర్‌-19 ప్రపంచకప్‌ అందించి టీమిండియాలోకి అడుగుపెట్టిన కుర్ర కోహ్లీని చూసి అరె బాగా ఆడుతున్నాడే అనుకున్నారు అంతా! అతడే తనలో ఎన్నో మార్పులు చేసుకొని ఈ రోజు ‘ఇంతింతై వటుడింతై’ అన్న చందంగా సచిన్‌ రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ ఔరా! అనిపిస్తాడని ఊహించలేకపోయారు.

* విరాట్‌ కోహ్లీ (213 వన్డేలు- భారత్‌)
* సచిన్‌ తెందుల్కర్‌ (266- భారత్‌)
* సౌరవ్‌ గంగూలీ (272- భారత్‌)
* రికీ పాంటింగ్‌ (272- ఆస్ట్రేలియా)
* జాక్వెస్‌ కలిస్‌ (286- దక్షిణాఫ్రికా)
* ఎంఎస్‌ ధోనీ (320- భారత్‌)
* బ్రియన్‌ లారా (287- వెస్టిండీస్‌)
* రాహుల్‌ ద్రవిడ్‌ (309- భారత్‌)

- Advertisement -