కోహ్లీ 100వ టెస్టు..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

69
kohli
- Advertisement -

మార్చి 4 నుండి శ్రీలంకతో భారత్ టెస్టు సిరీస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.ఇక ఈ తొలిటెస్టు విరాట్‌ కోహ్లీ వందవ టెస్టు కాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించింది బీసీసీఐ. మొహాలీ వేదికగా జరిగే తొలి టెస్టుకు స్టేడియంలోకి 50శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

బుధవారం నుంచి ఈ మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. కరోనా కారణంగా స్టేడియంలోకి అభిమానులకు అనుమతి లేదని మొదట ప్రకటించారు. దీంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజా నిర్ణయంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీకి అదిరిపోయే మధురానుభూతిని అందించేందుకు సిద్ధమైంది బీసీసీఐ.

- Advertisement -