సెబాస్టియన్‌ని ఆశీర్వదించండి: సాయికుమార్

124
Sai Kumar
- Advertisement -

సెబాస్టియన్ సినిమా చూసి అందరూ కిరణ్ అబ్బవరాన్ని ఆశీర్వదించాలన్నారు నటుడు సాయి కుమార్. మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన సాయికుమార్…ఎస్ ఆర్ కళ్యాణ మండప సినిమాతో కిరణ్‌తో పరిచయం ఏర్పడిందని…మంచి వ్యక్తి అన్నారు. సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నానని…మదనపల్లి పేరు వినగానే మా అమ్మ గుర్తుకువచ్చేదన్నారు.

కిరణ్…సెబాస్టియన్ తో హ్యాట్రిక్ కొట్టాలి. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మన సినిమా ఉండాలన్నారు. రాజాధిరాజ పాట చూస్తుంటే మా అమ్మ నాతోనే ఉందని అనిపిస్తుందన్నారు.

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నటుడు కిరణ్. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకోగా తాజాగా సెబాస్టియన్ పీసీ 524గా ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

- Advertisement -