అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు వీదేశీయులతో సరదాగా మాట్లాడుతూన్నట్లుగా కనిపిస్తోంది.
కోహ్లీ ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని ఉండగా, అనుష్క శర్మ భుజానికి ఓ ఆకుపచ్చ రంగు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంది. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ క్రికెటర్ అయినా సరే భార్యతో వెలుతుంటే ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అని కామెంట్ చేస్తున్నారు.
టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డేల్లో మాత్రమే కోహ్లీని భారత జట్టు తరుపున చూసే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో భారత జట్టు ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడనుంది.
VIRAT KOHLI & ANUSHKA SHARMA AT THE LONDON STREETS. ❤️
— Tanuj (@ImTanujSingh) August 17, 2025
Also Read:యూరియా కొరత..వాయిదా తీర్మానం

