షాకింగ్ వీడియో: రైలు కింద పడ్డ కుక్క!

19
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలును ఎక్కే ప్రయత్నం చేయగా అతనితో పాటు ఉన్న గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క భయంతో రైలులోకి ఎక్కేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో కదిలే రైలు కింద పడిపోయింది.

వీడియోలో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వ్యక్తులు కుక్క ఎలా ఉందో చూడడానికి ప్లాట్‌ఫారమ్ అంచుకు చేరుకుంటారు. అయితే కుక్క సురక్షితంగా బయటపడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి కుక్కను తీసుకుని తిరిగి రైలు ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by The Indian Express (@indianexpress)

 

Also Read:వక్ఫ్ బిల్లుకు లోక్ సభ అమోదం

- Advertisement -