ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బస్సు డ్రైవర్ తాను నడిపిన బస్సు విండోకు ఓ వ్యక్తి వేలాడుతూ ఉండగానే సుమారు ఒక కిలోమీటరు దూరం బస్సును నడిపారు.
ఈ ఘటన హాథ్రాస్లోని GT రోడ్డుపై జరిగింది. బాధితుడు తన భార్యతో కలిసి వెళ్తుండగా బస్సు అతని బైకు సహా ఇతర వాహనాలను వెనుక నుంచి ఢీకొట్టింది.బైక్ రైడర్ బస్సు డ్రైవర్ను ఆగమని కోరగా, డ్రైవర్ ఆగడానికి నిరాకరించాడు. చివరికి బాధితుడు బస్సు విండోను పట్టుకుని వేలాడుతూ వెళ్లాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్తుండగా, స్థానికులు బస్సును వెంబడించి చివరికి ఆపించారు. బస్సు ఆగిన తర్వాత బాధితుడు బస్సు ముందు నిలబడి గొడవచేయగా డ్రైవర్ తీరును అంతా తప్పుబట్టారు.
#हाथरस का एक वीडियो वायरल हो रहा है, जिसमें एक रोडवेज बस चालक ने एक बाइक सवार युवक को बस की खिड़की से लटकाकर करीब 1 किलोमीटर तक दौड़ा दिया। बताया जा रहा है कि किसी बात को लेकर बस चालक और बाइक सवार में कहासुनी हो गई थी, जिसके बाद गुस्साए चालक ने यह खतरनाक कदम उठा लिया। वीडियो में… pic.twitter.com/6hAjnOQr1K
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) April 5, 2025
Also Read:ఎన్టీఆర్పై హృతిక్ ప్రశంసలు!

