వైరల్ : అక్కినేనిపై బాలయ్య డైలాగ్‌

74
- Advertisement -

నందమూరి బాలకృష్ణ వేదికలపై అజాగ్రత్త గా మాట్లాడి నవ్వుల పాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి అంటూ బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో అన్న మాటలు మహిళా సంఘాలకు కోపం తెప్పించాయి. ఇక ఈ మధ్య దేవ బ్రాహ్మిన్స్ గురించి అన్న మాటలు వారిని బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో బాలయ్య దేవ బ్రాహ్మణులకు సారీ చెప్తూ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది.

తాజాగా అక్కినేని గురించి బాలయ్య చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. వీర సింహా రెడ్డి సక్సెస్ సందర్భంగా మేకర్స్ నిన్న రాత్రి ఘనంగా వీర సింహుని విజయోత్సవం అంటూ ఈవెంట్ నిర్వహించి టీం కు షీల్డ్స్ అందించారు. ఇక ఈవెంట్ లో బాలయ్య భారీ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. స్పీచ్ లో బాలయ్య తన తండ్రి గురించి వారి నటన గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు ఎప్పటిలానే. అదే సందర్భంలో రంగరావ్ , అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వరరావ్ పై మాట తూలాడు.

దీంతో సోషల్ మీడియాలో బాలయ్య అక్కినేని కుటుంబాన్ని బాధ పెట్టేలా మాట్లాడారని అక్కినేని ఫ్యాన్స్ తన కోపాన్ని వ్యక్త పరుస్తున్నారు. బాలయ్య తన తండ్రి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ ఇతర నటులను అదీ ఎన్ టీఆర్ తో సమానమైన అక్కినేని ని కించ పరుస్తూ మాట్లాడటం తప్పని అందరూ భావిస్తున్నారు. మరి బాలయ్య అనుకోకుండా అలా అన్నారా ? కావాలనే అక్కినేని వారిని ఇలా వేధికపై తక్కువ చేసి మాట్లాడాడా ? మరి దీనిపై బాలయ్య మళ్ళీ క్షమాపణ చెప్పే వరకూ అక్కినేని ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు.

ఇవి కూడా చదవండి…

బాలకృష్ణ…మైఖేల్ ట్రైలర్‌ విడుదల

ఆ పాట కోసం చాలా శ్రమించా…

యంగ్ హీరోలతో బాలయ్య ఫ్రెండ్ షిప్

- Advertisement -