హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రూల్స్ కఠినతరం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోజురోజు పెరుగుతున్న జనాభా! దీనికి తగ్గట్టే రోడ్డెక్కుతున్న వాహనాలతో సిటీలో ట్రాఫిక్ గుదిబండగా మారుతోంది. దీంతో ఎలాగైనా సమస్యకు చెక్ పెట్టాలని భావించింది సర్కారు. ఇప్పటికే రూల్స్ స్ట్రిక్ట్ చేసింది. డ్రంకన్ డ్రైవ్‌లు చేపట్టింది. ఇందులో పట్టుబడ్డ వారికి భారీ జరిమానా విధించడంతో పాటు జైలు శిక్షలు విధిస్తున్నారు. ఫలితంగా క్రమంగా ప్రమాదాలు తగ్గాయి.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా ట్రాఫిక్ నిబందనలను ఉలంఘిచినవారికి కొరడా విధించేదుకు సిధ్దమవుతోంది. నిబంధనలు అతిక్రమిస్తే భారీజరిమానాతో పాటు…బాధితులకు పరిహారం పెంపుపై ప్రతిపాదనలు చేసింది. మోటారు వాహనాల బిల్లు–2016కు ప్రతిపాదించిన కీలక సవరణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం గ్రీన్ సిగ్నలిచ్చింది.
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరని స్పష్టం చేసింది. మద్యం తాగి వాహనాలు నడిపేవారితో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని, హెల్మెట్, సీటు బెల్టు వాడని వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి పాదించారు. పార్లమెంటరీ సంఘం చేసిన దాదాపు అన్ని సూచనలను ప్రధాని అధ్యక్షత సమావేశమైన కేబినెట్ ఆమోదించిందన్నారు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ.ఈ బిల్లు వచ్చేవారం పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గతేడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పరిశీలన కోసం రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన స్థాయీ సంఘానికి పంపామన్నారు కేంద్ర మంత్రి.ఆన్‌లైన్ సేవల కోసం ఆధార్ ఆధారిత తనిఖీని బిల్లులో ప్రతిపాదించారని, దీంతో లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సునూ రవాణా కార్యాలయానికి వెళ్లకుండానే పొందొచ్చని పేర్కొన్నారు. దీనివల్ల ఒకే పేరుతో పలు లైసెన్సులు తీసుకోవడం కదురదన్నారు. వాహనాలను ఆర్టీఓ ద్వారానే రిజిస్టర్ చేయాలన్న స్థాయీ సంఘం సూచనను ప్రభుత్వం తిరస్కరిచిందని తెలిపారు.