అంకెల గారడీతో వంచిస్తున్న కేంద్రం: వినోద్ కుమార్

259
vinod kumar
- Advertisement -

అంకెల గారడీతో ప్రజలను కేంద్రం వంచిస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ .కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు జీ.డీ.పీ.లో కేవలం 1.5 శాతమేనని తెలిపిన వినోద్… జీ.డీ.పీ.లో 10 శాతం కేటాయింపులని కేంద్రం చెప్పడం పూర్తిగా మోసం అన్నారు.

ఐదు రోజులుగా ఊకదంపుడు ప్రకటనలకే కేంద్రం పరిమితం అయిందని…. మొత్తం రూ. 20.97 లక్షల కోట్లలో రూ. 9.94 లక్షల కోట్లు బ్యాంకులు, ఎన్ బీ ఎఫ్ సీ లకు ఆర్.బీ.ఐ. లిక్విడిటీ మద్దతునిస్తోందన్నారు.

మొత్తం ప్యాకేజీలో కొత్త, పాత లింక్డ్ స్కీం ల విలువ రూ. 9.74 లక్షల కోట్లు అన్నారు. వాస్తవానికి కేంద్రం ప్రకటించింది కేవలం రూ. 3.21 లక్షల కోట్లు మాత్రమేనన్నారు.

అమెరికా, యూరోపియన్ దేశాలతో పోల్చితే ఇవీ అతి తక్కువ నిధులు అని… ఎఫ్.ఆర్.బీ.ఎం. రుణాలపై ముందస్తు షరతులు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం అన్నారు. ప్రైవేటీజేషన్, డీ రెగ్యులేషన్, అండర్ టేకింగ్ రిఫర్మ్స్ లతో తక్షణ ప్రయోజనం ఉండదన్నారు వినోద్ కుమార్.

- Advertisement -