ఉనికిని చాటుకునేందుకే టీఆర్ఎస్‌పై ఆరోపణలు..

301
Jeevan reddy

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ,మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నుద్దేశించి బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల పై మండిపడ్డ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.

బీజేపీ నేతలు కేవలం తమ ఉనికి చాటుకునేందుకే తరచుగా ఎన్నికల కమిషన్ కు తమ అభ్యర్థి కవిత పై పిర్యాదు చేస్తున్నారన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ,ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ .జీవన్ రెడ్డి ఆరోపించారు.

స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు తగిన ఓటర్ల బలం లేకున్నా బీజేపీ అభ్యర్థి ని దింపిందని వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలతో ఆకర్షితులమయ్యే తాము టీఆర్ఎస్‌లో చేరుతున్నామని బీజేపీ స్థానిక ప్రజా ప్రతినిధులే స్వయంగా చెబుతున్నారని……ప్రలోభాలకు దిగాల్సిన అవసరం టీఆర్ఎస్‌కు ఎంత మాత్రం లేదన్నారు.

అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాలను మారుస్తున్న బీజేపీ నీతులు గురివింద సామెతను తలపింప జేస్తున్నాయని…ఆడలేక మద్దెల ఓడు అనే రకంగా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదు లో ఏ ఒక్క ఆరోపణకు ప్రామాణికత లేదన్నారు. కేవలం బట్ట గాల్చి మీద వేయడమే బీజేపీ నేతల పని అన్నారు.

ఎపుడూ ఎన్నిక జరిగినా కవిత ఘన విజయం ఖాయం అని బీజేపీ నేతలు హుందా తనంతో ప్రవర్తిస్తే అది వారికే మంచిదని హితవు పలికారు బాజి రెడ్డి గోవర్ధన్ ,జీవన్ రెడ్డి.