కిషన్ రెడ్డి, బండి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి..

84
b vinod
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం సహా అనేక రంగాల్లో దేశ నిష్పత్తి కంటే కూడా ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఆర్.బీ.ఐ.) 2021 నివేదికను నిన్న (బుధవారం) విడుదల చేసిందని, ఆ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో మెరుగైన ప్రగతిని సాధించి దేశ నిష్పత్తి కన్నా మెరుగ్గా ఉందని వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రగతిపథంలో పయనిస్తున్న గణాంకాలను వినోద్ కుమార్ గురువారం విడుదల చేశారు.

ఆర్.బీ.ఐ. నివేదికను చూసి అయినా కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు గ్రహించాలని, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. కేవలం రాజకీయంగా విమర్శలు చేయడం, ప్రగల్భాలు పలకడం మానుకోవాలని వినోద్ కుమార్ అన్నారు. వీలైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధుల విడుదలకు, కొత్త పథకాలను తెచ్చేందుకు కృషి చేయాలని వినోద్ కుమార్ హితవు పలికారు. ఆర్.బీ.ఐ. 2021 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రగతి అధ్భుతంగా ఉందని, దేశ యావరేజ్ కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఎంతో మెరుగ్గా ఉందని ఆయన వివరించారు.

ఆయా రంగాల్లో దేశ నిష్పత్తి కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి గణాంకాలు శాఖలు, విభాగాల వారిగా ఇలా ఉన్నాయి.

వ్యవసాయ రంగంలో పప్పు ధాన్యాలు ( పల్స్ సెస్ ) ఉత్పత్తిలో దేశ వ్యాప్త నిష్పత్తి 34.2% కాగా, తెలంగాణ రాష్ట్ర నిష్పత్తి మూడింతలు పెరిగి 108.8% ఉందని అన్నారు. వరి పంట ఉత్పత్తిలో దేశ యావరేజ్ 12.7% కాగా, తెలంగాణ రాష్ట్ర యావరేజ్ 67.3% ఉందని, పత్తి ( కాటన్ ) దేశ యావరేజ్ 3.6% కాగా తెలంగాణ రాష్ట్ర యావరేజ్ రెండు వందల శాతం కన్నా ఎక్కువగా 79.8% ఉందని.. మాంసం ( మీట్ ) ఉత్పత్తిలో దేశ యావరేజ్ 28.5% కాగా తెలంగాణ రాష్ట్రం 67.9% శాతంతో మెరుగైన స్థానంలో నిలిచిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

అలాగే సాగు నీటి సౌకర్యాలలో తెలంగాణ రాష్ట్రం 34.2% శాతంలో ఉండగా దేశ యావరేజ్ మైనస్ 11.1% శాతం.. ఫుడ్ గ్రేన్స్ లో ఇండియా 2.2% లో ఉండగా తెలంగాణ రాష్ట్రం 22.2% లో ఉందని అన్నారు. జీ.ఎస్.వీ.డీ లో దేశ యావరేజ్ 31.82% కాగా తెలంగాణ రాష్ట్రం 69.69%ఓ ఉందని తెలిపారు. ప్రొడక్టీవ్ క్యాపిటల్ లో తెలంగాణ రాష్ట్రం 77.84.% కాగా దేశ యావరేజ్ 37.24% ఉందని అన్నారు.

విద్యా రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించిందని వినోద్ కుమార్ తెలిపారు. ప్రైమరీ స్కూల్ ఎన్రొల్మెంట్ లో దేశ యావరేజ్ 102.7% కాగా తెలంగాణ రాష్ట్రం 111.9% ఉందని, అప్పర్ ప్రైమరీ ఎన్ రోల్ మెంట్ లో దేశ యావరేజ్ 89.7% ఉండగా తెలంగాణ రాష్ట్రం 97.4% ఉందని, ఉన్నత విద్యా ఎన్ రోల్ మెంట్ లో దేశ యావరేజ్ 51.4% కాగా తెలంగాణ రాష్ట్రం 57.2% ఉందన్నారు.

విద్యుత్ రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశ యావరేజ్ కన్నా ఎంతో ప్రగతిని సాధించిందని వినోద్ కుమార్ తెలిపారు. పర్ క్యాపిట పవర్ అందుబాటులో ఉన్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం 65.35% ఉండగా, దేశ వ్యాప్త పరిస్థితి 21.08% మాత్రమే ఉందని అన్నారు. విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి వృధాలో తెలంగాణ రాష్ట్రం మైనస్ 5.41% కాగా దేశ నిష్పత్తి మైనస్ 9.39% ఉందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని, నిర్మాణాత్మక పాత్రను పోషించాలని వినోద్ కుమార్ సూచించారు.

- Advertisement -